Tuesday 19 June 2012

అచ్చుకెక్కని శ్రీశ్రీ పాట




సంపుటాలకు ఎక్కని శ్రీశ్రీ సినిమా పాట 


తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి శ్రీశ్రీ సినిమా పాటలమీదా తనదయిన బలమయిన ముద్ర 


వేశాడు. అజరామరం అనదగిన పాటలు అనేకం రాశాడు. ఇంతవరకూ ఏ సంపుటాలలోనూ అచ్చుకాని ఈ పాట 


1982 మే 5 వ తేదీన  రాశాడు. ' అంకురం  '  ఫేమ్ సి. ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన


' పూలపల్లకీ '   సినిమా కోసం రాసిన గీతం ఇది. శ్రీశ్రీ  సినిమా పాటల సంపుటాలలో ఈ పాట లేదు. 


మహాకవి శ్రీశ్రీ రాసిన  ఈ పాటను   సేకరించి ఇచ్చిన   మిత్రుడు  శ్రీశ్రీ  విశ్వేశ్వరరావు కి కృతఙ్ఞతలు.




మహాకవి శ్రీ శ్రీ

పాట 


ఈ యింటిలో దీపమై హాయిగా

నా కంటిలో పాపవై జాలిగా


నా నీడలో నిద్ర  పోరా

నా గుండెలో నిల్చి పోరా||


దగా నిండు  రేయిదీ , దయా దృష్టి  లేనిదీ,

విలాసాల కోసమే ధనం జల్లు వానిదీ!

విడనే విడదు విషాదాల చీకటీ,

విలాపాలగాద వేధించే బాధ

భరించాలి నాయనా || ఈ ||


ప్రపంచాన్ని కాదనీ, భయం నాకు లేదనీ

ప్రమాదాల దారినే ప్రయాణించి నానులే

పగతో జగమే పరీక్షించు వేళలో

మహాదీక్ష బూని డెందాన ధైర్యం (మది )

వహించాలి నాయనా ||ఈ ||








.


3 comments:

  1. ఈ పాట అచ్చుకెక్కలేదేమో కానీ, సంగీతాభిమానులకు బాగా తెలిసిన పాటే! ఇళయరాజా శ్రావ్యంగా స్వరపరిచిన ఈ పాటను జానకి పాడారు. దీన్ని ఆత్రేయ రాశారని ఇన్నేళ్ళూ అనుకున్నాను. ఇళయరాజా సంగీతం కూర్చిన శ్రీశ్రీ పాట ఇదొక్కటేనేమో! (‘రుద్రవీణ’లో ‘నేను సైతం’ పల్లవి మినహాయిస్తే..).

    శ్రీశ్రీ చేతిరాతతో ఈ పాటను చూడటం చాలా బాగుంది. సేకరించిన విశ్వేశ్వరరావు గారూ, పోస్టు చేసిన మీరూ అభినందనీయులు!

    పూలపల్లకి (1982)లోనే ‘భావనలొకటై..’ అనే మరో పాట కూడా నాకిష్టం. వచనం, గానం మిళితంగా సాగే వెరయిటీ పాట!

    ReplyDelete
  2. అచ్చుకెక్కకపోయినా మహాకవి గారి స్వదస్తూరితో రాసిన పాట చూసే భాగ్యం కలిగించారు.
    అభినందనలు!

    ReplyDelete
  3. Thanks for showing SRI SRI hand writing....

    ReplyDelete