Monday 26 March 2012

పికాసో ఏమనెను?

 

 

 

పికాసో ఏమనెను? 


పిల్లలందరూ చిత్రకారులే . అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తరువాత కూడా కళాకారులుగా నిలబడటం ఎలా అన్నదే సమస్య. మనం ఏది చిత్రించాలి, ముఖం మీద కనిపిస్తూ  వున్నదా? ముఖం లోపల వున్నదా?
 ముఖం వెనుక వున్నదా? 
కళ ఒక అబద్ధం.అయితే  సత్యాన్వేషణలో అది మనకు సాయం అందిస్తుంది.


అనావస్యకత  తాలూకు నిరసనే  - కళ!


ఆత్మమీద పేరుకుపోయిన రొజువారీ జీవితపు దుమ్మూ,ధూళిని పరిశుభ్రం చేస్తుంది కళ.


అల్ప  కళాకారులు అరువు  తెచ్చు కుంటారు, గొప్ప కళాకారులు దొంగిలిస్తారు.


కంపూటర్లు పనికి మాలినవి , అవి కేవలం మీకు సమాధానం మాత్రమే ఇవ్వగలవు.


సృజనకు సంబంధించిన ప్రతీ  కార్యకలాపం ప్రధానంగా విధ్వంసక కార్యకలాపం అయి వుంటుంది.


ప్రతీ అంశం ఒక మహత్యమే. స్నానం చేసేటపుడు చక్కర తునక లాగా కరిగిపోక పోవటం కూడా మహత్యమే.

9
నువ్వు ఊహించ గలిగిన ప్రతీ వస్తువు వాస్తవిక మయినదే.

10 
నేను అన్వేషించను, నేను సాధిస్తాను.

11 
మనం  మస్తిష్కాన్ని తీసిపారేసి కేవలం మన కళ్ళను మాత్రమే ఉపయోగించుకో గలిగితే ఎంత బావుణ్ణు.

12 
డైరీ రాయటం అనే చర్యకు మరో పేరే పెయింటింగు..

13
కొంతమంది పెయింటర్లు సూర్యుణ్ణి పసుపు పచ్చని మరకగా మార్చుతారు,
మరికొందరు పసుపు పచ్చని మచ్చని సూర్యునిగా మార్చుతారు.

14

సదవగాహన సృజనకి బద్ధ  శత్రువు.

15
సమకాలీన ప్రపంచంలో ఏదీ అర్ధం కాదు, మరి అర్థం అయ్యే పెయింటింగు నేనెందుకు వెయ్యాలి?

16 
మనం ముసలి వాళ్ళం కావటం లేదు, పండి పోతున్నాం. అంతే!

17
మనిషి ముఖ కవళికలను ఎవరు సరిగా చూడగలరు, ఫోటో గ్రాఫరా, అద్దమా, లేదా పెయింటరా?

18 
పని అనేది మనిషికి ఒక అవసరం. అలారం గడియారాన్ని కూడా మనిషే ఆవిష్కరించాడు.

19 
నవ యవ్వనానికి  వయసంటూ వుండదు.
                        

 

Saturday 24 March 2012

inshaa

 

 

 

ఇన్షా


మా  మనవరాలు  ఇన్షా

వయస్సెంత ? మూడేళ్ళు 

అల్లరి పిల్ల ! అన్నమే తినదు

వో  రోజు వాళ్ళ  నానమ్మ  చేతిలోంచి 

అమాంతంగా  అప్పడం  లాగేసుకుని 

పరుగెత్తుకుని పోయింది 

వెలుగుల వెన్నెల వాకిటి  లోకి 

అప్పడం ఏదని అడిగితే

ఆకాశం కేసి చూయించింది   అమాయకంగా 

చందమామా నిజం చెప్పు 

అప్పుడు నీ వయస్సెంత?