Wednesday 5 June 2013

ఆక్తేవియో పాజ్ కవిత




ఆక్తేవియో పాజ్ కవిత 

నిశ్చయం


ఒకవేళ ఈ లేంప్ నుంచి వస్తూన్న

 తెల్లని కాంతి  వాస్తవమయితే,

వాస్తవమే   రాస్తున్న చేయి

మరి వాస్తవమేనా 

నేను రాస్తున్నదాన్ని  

చూస్తూన్న కళ్ళు



ఒక పదంనుంచి  మరో పదానికి  వెళ్తూ 

చెరిగిపోతుంది నా పలుకు 

నేను జీవించివున్నానని నాకు తెలుసు

రెండు వాక్యాంశాల మధ్య  


తెలుగు :

ఖాదర్ మొహియుద్దీన్