Tuesday 5 June 2012

రూపమే ముఖ్యం......!



రూపమే ముఖ్యం......!

ఆక్తావియో పాజ్ 


ఒక కవితలోని వాస్తవ భావాలు ఆ కవిత రాయటానికిముందు కవిలో ఉద్భవించినవి కావు.

 రాసిన తరువాత ఉద్దేశ్యపూర్వకంగాగానీ, యాద్రుచ్చికంగాగానీ ఆ రచన ద్వారా వ్యక్తమయ్యేవే వాస్తవ భావాలు. 

రూపం నుంచి వస్తువు ఉద్భవిస్తుంది. వస్తువు నుంచి రూపం కాదు. 

ప్రతీ రూపం తనదయిన ఆలోచనకీ, తనదయిన ప్రాపంచిక  దృష్టికీ జన్మనిస్తుంది. 

రూపం అర్థ సంపన్నమై వుంటుంది. 

 అంతకన్నా ముఖ్యమయిన విషయం - 

కళా ప్రపంచం లో అర్థ సంపన్నమై వుండేది కేవలం రూపం మాత్రమే. 

కవిత్వం అర్థం కవి చెప్పాలని అనుకుంటూన్న దానిలో కాదు, 

అంతిమంగా   ఆ కవి వ్యక్తం చేసిన దానిలో వుంటుంది. 

మనం చెప్పాలని అనుకుంటున్నది ,

 వాస్తవంగా మనం చెప్పినదీ  రెండూ ఒకటి కావు. 

అవి పూర్తిగా భిన్నమయిన రెండు వేర్వేరు అంశాలు.











No comments:

Post a Comment