మామిడి టెంకె
ఎవరో పెంకె పిల్లాడు
నిర్లక్ష్యంగా విసిరేసిన టెంకె
వచ్చి వాలింది నా వళ్ళో
అర క్షణం నాలోపల అస్తి నాస్తి విచికిత్స
మదిలో ఒక విచిత్ర గతితర్కం మీమాంస
చీకి పారేసిన మామిడి టెంకెలో
ఆదమరిచి నిద్రిస్తూన్నఏదో ఒక ఆదిమ జీవి అలికిడి
అర క్షణం నాలోపల అస్తి నాస్తి విచికిత్స
మదిలో ఒక విచిత్ర గతితర్కం మీమాంస
చీకి పారేసిన మామిడి టెంకెలో
ఆదమరిచి నిద్రిస్తూన్నఏదో ఒక ఆదిమ జీవి అలికిడి
ఆకృతి అందని దశలో ఆరాటపడుతూన్న ప్రకృతి
లోలోపల ఏవేవో పరవశిస్తూన్నప్రాచీన స్మృతుల సవ్వడి
భూమీ ఆకాశాల అనంతానంత అనుబందాల మధ్య
వర్ధిల్లాలని వాంచిస్తూన్న వృక్ష వంశ సహస్రాలు
వర్ధిల్లాలని వాంచిస్తూన్న వృక్ష వంశ సహస్రాలు
సుగంధాలు, పరీమళాలు, పరిపక్వమైన మాధుర్యాలు
పచ్చ పచ్చని వృక్షాల ప్రపంచాన్ని
పచ్చ పచ్చని వృక్షాల ప్రపంచాన్ని
కోలాహలంతో నింపాలన్న కుతూహలంతో
కిలకిలకిలకిలమంటూ గుంపులు గుంపులుగా
కదిలే లక్షలు లక్షల పక్షుల సమూహాలు
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete