Thursday 26 April 2012

అమ్మకూచి

 

 

 

అమ్మకూచి 

అరటి పండు వలిచినట్లు ఆ చెట్టును  గురించి

ఇక ఆమె చెబుతూన్నదేదీ 

వాడి చెవికి ఎక్కదు గాక  ఎక్కదు

ఆమె చెబుతూన్న మాటల మెట్లమీంచి వాడు

అలా అలా అడుగులు వేస్తూ అమాంతంగా 

అదృశ్యం అయిపోయాడు ఆకాశంలో 

సరాసరి  స్వర్గంలోంచి చెట్టు మీదికి దిగుతూన్న

పండ్ల రంగూ రుచీ వాసనా చూస్తూ 

పరవశంలో పరవళ్ళు కొడుతున్నాడు 

అమ్మ మాటలకు పరధ్యానంగా

వాడు కొడుతూన్న'ఉ ఊ' ఊయలగా మారి 

అటు నేలకీ, ఇటు ఆకాశానికీ మధ్య

  వూగుతూంది ఉల్లాసంగా .......


..........
  

 

7 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. సాంకేతిక సమస్యతో వ్యాఖ్యలు మాయమయ్యాయి. వాటిని రికవర్ చేసి ఇక్కడ ఇస్తున్నాను.

      ఉష గారి వ్యాఖ్య: మీ బ్లాగుకి ఇవాళే వచ్చినా, వచ్చిన దాన్ని వచ్చినట్టే అన్నీ కవితలూ చదివేశాను, ఈ కవితా అయితే పైకి 3 సార్లు చదివి మరీ చిత్రాన్ని కనులెదుటికి రప్పించుకున్నాను.

      Delete