Sunday 29 April 2012

కిటికీలోంచి.....

 

కిటికీలోంచి.....


మాటిమాటికీ మెట్లు ఎక్కీ దిగుతూ 

ముచ్చటగొలిపే పిల్లాడిలా ఎండ

ఎంత తప్పించుకు తిరుగుదామన్నా 

కాళ్ళను చుట్టేసుకుంటుంది నీడ 

ఎండ తుట్టెలోంచి తేమను పిండుకుందామని

ఎన్నాళ్ళనించో నా ప్రయత్నం 

వెదురు నిచ్చెనలమీంచి

మేఘాల చెట్లెక్కి 

చినుకుల్ని కోసుకురావాలని   

చిన్నప్పట్నించీ నా తాపత్రయం 

తీరా వెళ్లి ఎలాగోలా 

మబ్బుల మూతల్ని తప్పించి  చూస్తే
 
బెకబెకబెకమంటూ

బెదిరించేస్తాయి  కప్పలు

సంధిద్దామని

అందుకోబోయేంతలో

ఊసరవెల్లి అయిపోయి

ఆకాశం మీంచి అమాంతంగా

ఏ పచ్చని చెట్టుమీదికో దూకేస్తుంది

ఏడు రంగుల ఇంద్రధనుసు

పరిసరాల కతీతంగా నేత్రాల అద్వైత స్థితిలో

తాటి చెట్లయి కిటికీ చువ్వలు

భూమ్యాకాశాల మధ్య

గుదిబండలా వేలాడుతూ

ఎప్పటిలాగే ఎండ ....

  

4 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. సాంకేతిక సమస్యతో వ్యాఖ్యలు మాయమయ్యాయి. అలా పోయిన వాటిని ఇక్కడ ఇస్తున్నాను.
      వేణు వ్యాఖ్య : కిటికీలోంచి ఎంతటి ముచ్చటైన దృశ్యాల్ని చూపించారో కదా!..

      >> ఎండ తుట్టెలోంచి తేమను పిండుకుందామని >> అనే వ్యక్తీకరణ గమ్మత్తుగా అనిపించింది. ఇక హరివిల్లును ఊసరవెల్లిని చేయటం కూడా చాలా బాగుంది!

      Delete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. puranapandaphani (http://puranapandaphani.wordpress.com/) commented:

      window poetry, huh. cool

      Delete