Wednesday 2 May 2012

పికాసో ప్రేయసులు - 5



 పికాసో ప్రేయసులు - 5

ఫ్రాంకాయిస్ జీలో


అది 1944 వ సంవత్సరం. పికాసో వయస్సు 63 సంవత్సరాలు. 

ఆర్ట్స్ విద్యార్ఠిని జీల ప్రేమలో పద్దాదు.  అప్పుడు ఆమె వయసు 23 సంవత్సరాలు. పికాసో తో ఏర్పడిన ప్రేమ సంబంధాన్ని ఆమె తన కెరియర్లో గొప్ప మలుపుగా కూడా భావించుకుంది. పికాసో సాహచర్యంలో ఆ తరువాత  ఆమె అనేక కళా మర్మాలను తెలుసుకుంది. పికాసో విషయంలో ఆమె ఒక కళా మర్మఙురాలుగా, అనగా ఆర్ట్ క్రిటిక్ గా తన సేవలను అందించింది. జీలో కేవలం ఒక మోడల్ గా మాత్రమే గాక పికాసో ఎగ్సిబిషన్  లకు హోస్ట్  గా కూడా వ్యవహరించింది.
 
డోరా మార్ తో వున్న కాలం లోనే జీలోతో ప్రేమకలాపాలను ప్రారంభించాడు పికాసో. ఆ తరువాత డోరా మార్ కు దూరమవుతూ వచ్చాడు. వాళ్ళిద్దరూ విడిపోయిన తరువాత జీలో పూర్తిగా పికాసోతో సహజీవనం సాగించింది. 

ఆమె కూడా పెయింటింగ్స్ వేసింది.  పెయింటర్ గా ఆమె కూడా  మంచి పేరు  సంపాదించింది. ఒక అత్యంత ప్రతిభావంతురాలైన  జీలో అనవసరంగా పికాసో ప్రేమలో పడి తన భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుందని ప్యారిస్ కళాప్రపంచం  అభిప్రాయ పడింది. పికాసోతో సంబంధం లేకుండా ఆమె తన పెయింటింగ్స్ ప్రపంచం ముందు పెట్టివుంటే ఆమెకు మరెంతో ఖ్యాతి వచ్చి ఉండేదని వ్యాఖ్యానించింది. 

జీలోఎక్కువ కాలం  ప్యారిస్ లోనే  జీవించింది. రష్యన్ నర్తకి, పికాసో మాజీ భార్య ఓల్గా నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంది. పికాసో ప్రేయసులలో ఓల్గా ద్వారా జీలో అనుభవించినన్ని చిత్రహింసలను వేరెవరూ అనుభవించలేదు. చివరికి జీలో జీవితం కూడా ఓల్గా జీవితం లాగే మారిపోతూ వచ్చింది. పది సంవత్సరాలపాటు  పికాసోతో కలిసి కాపురం చేసిన జీలో శాశ్వతంగా అతని జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆమె ' లైఫ్ విత్ పికాసో ' అని పుస్తకం రాసింది.ఆ రోజుల్లో ఆ పుస్తకం ఒక గొప్ప సంచలనం. ఈ పుస్తకం ప్రతులు లక్షల సంఖ్యలో అమ్ముడు పోయాయి. ఆ పుస్తకానికి లభించిన ఆదరణను చూసి పికాసో తట్టుకోలేక పోయాడు.తక్షణం ఈ పుస్తకం ప్రచురణను నిలిపివేయమని కోర్టులోలో కేసు వేశాడు పికాసో. అయితే ఈ కేసులో ఓడిపోయాడు. 

అనంతర కాలంలో ఆమె పెయింటర్ గా, రచయిత్రిగా శేష జీవితాన్ని గడిపింది. పికాసో కాపురం చేసి,   విడిపోయికూడా పిచ్చిది కాకుండా మానసికంగా ద్రుఢంగా నిలబడిన మహిళ జీలో ఒక్కతే.   

******************


3 comments:

  1. Full of twists and interesting incidents.... very nice lines - పిచ్చిది కాకుండా మానసికంగా ద్రుఢంగా నిలబడిన మహిళ జీలో ఒక్కతే.

    ReplyDelete
  2. ఇటువంటి anecdotes చదువుతుంటే, 40లలో ప్రవేశించాను కాబట్టి, ఇక మలి సంధ్యకు చేరువయ్యానని, ఏ ఫ్రాంకాయిస్ జీలో లేదా, ఏ అమీనా నన్ను ప్రేమించదేమో నన్న దిగులు కాసేపు పక్కనపెట్టేస్తాను. నాలో లేనిపోని ఆశలు రేపుతున్నారు ఖాధర్ గారు, మీ రాతలతో...

    ReplyDelete
  3. Khadar bhai..you have given very information about Jeelo.

    ReplyDelete