ఒక జాపనీయ కవిత
పసుపు పచ్చని పక్షుల ల్యాండ్ స్కేప్
షుంతారో తనికావా
పక్షులున్నాయి
కాబట్టి ఆకాశం వుంది
ఆకాశం వుంది
కాబట్టి బెలూన్లు వున్నాయి
బెలూన్లు వున్నాయి
కాబట్టి పిల్లలు పరుగులు తీస్తున్నారు
పిల్లలు పరుగులు తీస్తున్నారు
కాబట్టి నవ్వులు వున్నాయి
నవ్వులు వున్నాయి
కాబట్టి విషాదం వుంది
విషాదం వుంది
కాబట్టి ప్రార్థన వుంది
మోకరిల్లేందుకు నేల వుంది
నేల వుంది
కాబట్టి నీరు ప్రవహిస్తుంది
నేడు వుంది, రేపు వుంది
ఒక పసుపు పచ్చని పక్షి వుంది
కాబట్టి సమస్తమయిన రంగులు, రూపాలు,
చలనాల ప్రపంచం వుంది
so simple and sooo complex.
ReplyDeletenice one.
Chaalaa baagundi
ReplyDeleteభలే
ReplyDeleteపసిపిల్లల నవ్వులున్నాయి
ReplyDeleteఅందుకే ప్రపంచం అందంగా ఉంది.